by Suryaa Desk | Mon, Jan 27, 2025, 03:53 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.