by Suryaa Desk | Tue, Jan 28, 2025, 10:54 AM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఆర్ఎస్పీ తన ఫిర్యాదుల్లో ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని రాసుకొచ్చాడు. ఫార్ములా ఈ రేస్ పై రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులు వెనక్కి పోయాయని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ లో అవినీతి జరిగిందని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్( పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ ఈడీ, ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగిన ఫార్ములా-ఈ రేస్ కేసు యావత్ భారత దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసింది. ఎక్కడో విదేశాల్లో జరిగే ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ గడ్డపై నిర్వహించడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రేసుకు సంబంధించి నాటి ప్రభుత్వం యూకేకు చెందిన ఫార్ములా ఈ-ఆపరేషన్స్ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ నుంచి హెచ్ఎండీఏ(HMDA) చెల్లించింది. కాగా ఈ చెల్లింపులలో ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్(Danakishore) ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.