by Suryaa Desk | Wed, Jan 29, 2025, 01:48 PM
కష్టాల్లో ఉన్న సామాన్యులను ఆదుకోవడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ డివిజన్ కు చెందిన పి. లక్ష్మి అనారోగ్య సమస్య కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ కు తెలియజేయడంతో, సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సీ ద్వారా 2, 50, 000 మంజూరు చేయించి, ఎల్ ఓ సీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.