by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:16 PM
ప్రజా యుద్ధనౌక గద్దర్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన బతుకుల బాగుకోసం ఉద్యమించిన వ్యక్తి గద్దర్ అని, ఆయనను కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.