by Suryaa Desk | Tue, Jan 28, 2025, 04:01 PM
ప్రజా గాయకుడు గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లిలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తన ఆట, పాటలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గద్దర్‌పై సంజయ్ నోరు పారేసుకోవడం సరైంది కాదన్నారు.బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా, ‘నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.