by Suryaa Desk | Wed, Jan 29, 2025, 02:55 PM
బీసీ కులాలలో ఐక్యత లేకపోవడంతో అగ్రవర్ణాలు అదనగా భావించి అనిచివేస్తున్నాయి ఐక్యంగా ఉద్యమించి బీసీల సత్తా చాటాలని మత్స్యశాఖ చైర్మన్ బిక్షపతి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయంలో బీసీ గర్జన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నా కూడా ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలే ఉన్నత పదవుల్లో కొనసాగుతూ బీసీలను అణచివేస్తూ ఆర్థికంగా అనుగదొక్కుతున్నారన్నారు.
బీసీ పాలకులు ఉన్నప్పుడే బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు, వ్యాపారులకు ఆర్థిక చేయూత, అన్ని రంగాలలో బీసీలకు సహాయ సహకారాలు అందడంతో ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతారన్నారు. అప్పుడే బిఆర్ అంబేద్కర్ కన్నా కళ్ళలో నిజమవుతాయని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు బీసీ లందరూ ఐక్యంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీల సత్తా అన్ని పార్టీలకు చూపిస్తే వారే దిగివస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బయ్య శ్రీనివాస్, కుక్కల రఘుపతి, గుండెబోయిన శ్యామ్ , గుండెబోయిన కుమార్, భయ్యా కుమారస్వామి, భయ్యా తిరుపతి బయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు.