by Suryaa Desk | Wed, Jan 29, 2025, 02:50 PM
ఈనెల 26వ తేదీని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన మహా హారతిలో బోటు అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కనిపించకుండాపోయిన అజయ్ అనే యువకుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది.దీంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే మృతుడి బంధువులు గాంధీ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. 'వద్దురా నాయన.. కిషన్ రెడ్డి పాలన' అంటూ నినాదాలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై స్పందించి అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్చేశారు. ఇదిలాఉండగా, గణతంత్ర దినోత్సవం నాడు మహా హారతి పేరిట కేంద్రమంత్రి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించగా.. ప్రమాదవశాత్తు బోటులోని టపాసులకు నిప్పంటుకుని ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.