by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:02 PM
ఇటీవల గుండెపోటుకు చికిత్స పొంది కోలుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్‌ను ఆదివారం మోండా మార్కెట్‌లోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు కలుసుకొని పరామర్శించారు. భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, నేతలు మర్రి పురురవ రెడ్డి, నర్సింగ్ రావు, దయానంద్, ఈశ్వర్ తదితరులు పద్మారావు గౌడ్‌ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.