by Suryaa Desk | Mon, Jan 27, 2025, 01:51 PM
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారంలోని పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు.