by Suryaa Desk | Tue, Jan 28, 2025, 02:41 PM
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భారతి అన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం మార్కెట్ కార్యాలయం వద్ద కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. అధికారులపై దాడులు చేయడం సరైంది కాదని ఆమె అన్నారు.