by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:13 PM
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను మండల అధికారులు అందజేయడం జరిగింది. ఈ నాలుగు పథకాలకు వీరాపురం గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మానకొండూరు.
ఎమ్మెల్యే కొవ్వెంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు ఆయా లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు, ప్రభుత్వం ఇచ్చిన అమీ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మిట్టపల్లి చెన్నారెడ్డి, మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి, మిట్టపల్లి రాజిరెడ్డి, చుక్క సమీకృత్, చుక్క హరీష్, చిలుముల శ్రీకాంత్, చిలుముల ప్రశాంతు, మహంకాళి, కుమార్ తదితరులున్నారు.