by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:53 PM
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తూ, ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా, నూతనంగా ప్రారంభించిన నాలుగు ప్రభుత్వ పథకాలను అందించుట గాను ""ఇందిరమ్మ మోడల్ విలేజ్"" గా నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామాన్ని ఎంపిక చేసి, మా గ్రామానికి అండగా నిలిచిన గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారికి మా బొల్లికొండ గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గ్రామ మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ చంద్రు గార్లు అన్నారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, బొల్లికొండ గ్రామంలోని అర్హులైన అందరికీ పూర్తిస్థాయిలో అందించుటకు శ్రీ దొంతి మా రెడ్డి గారు కృషి చేశారని, వారికి మా గ్రామంలోని ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని, వారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకుంటామని, ""బొల్లికొండకు అండ - మా దొంతి మాధవన్న"" అని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బొల్లికొండలో ఈరోజు శ్రీ దొంతి మాధవ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణసంచాపేల్చి, గ్రామ ప్రజలందరూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా బొల్లికొండ గ్రామం మోడల్ గ్రామంగా ఎంపిక కావడానికి సహకరించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్ నాయక్,గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ చంద్రు,కాంగ్రెస్ నాయకులు భానోత్ వెంకన్న, డప్పు వెంకన్న, కాసోజు భీష్మాచారి, భానోత్ నెహ్రూ, గోపి, యాకు, మాలోత్ వెంకన్న, హీరామన్, మహిళా నాయకురాళ్లు బట్టు దివ్య, బానోత్ ఈరమ్మ, యూత్ కాంగ్రెస్ నాయకులు బానోత్ సంతోష్, సురేష్, శ్రీను, మసూరి తదితరులు పాల్గొన్నారు.