by Suryaa Desk | Thu, Jan 30, 2025, 02:33 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం గురువారం అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందని విమర్శించారు.