by Suryaa Desk | Tue, Jan 28, 2025, 02:33 PM
నారాయణపేట మండలం కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను, పరిసరాలను పరిశీలించారు.
అన్ని రకాల మందులు అందుబాటులో వున్నాయా, సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యారు అనే విషయాలను వైద్యురాలు ప్రతిభ భారతి ని అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పాల్గొన్నారు.