by Suryaa Desk | Tue, Jan 28, 2025, 08:19 PM
అభివృద్ధి పనులతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బాన్సీలాల్ పేట మేకలమండిలో రూ. 19.25 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ రీమోడలింగ్ పనులను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలను ఎంతో అభివృద్ధి చేసి దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేశామని ఎమ్మెల్యే అన్నారు.