by Suryaa Desk | Tue, Jan 28, 2025, 02:27 PM
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు మంగళవారం ప్రజాభవన్ ముందు ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 1399 మంది అభ్యర్థులు ఉన్నార.
వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.