by Suryaa Desk | Mon, Jan 27, 2025, 12:33 PM
TG: రైతు భరోసా నిధుల జమలో ఎదురయ్యే సాంకేతిక సమ్యలపై అధికారులు ఫోకస్ పెట్టారు. గతంలో ఎదురైన సమస్యలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించాలని అధికారులు నిర్ణయించారు.