by Suryaa Desk | Mon, Jan 27, 2025, 02:49 PM
ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం కురుమ కులస్తులు నిర్వహించిన బండారు ఉత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కురుమ సోదరులపై బండారు (పసుపు) చల్లి ఆశీర్వదించారు. ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే బండారు ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.