by Suryaa Desk | Mon, Jan 27, 2025, 06:55 PM
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు పథకాలు నెక్కొండ మండలంలోని బొల్లిగుంట గ్రామంలో ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ భూమికి విత్తు కు ఎంత అనుబంధమో కాంగ్రెస్ కు రైతులకు అంత అనుబంధం ఉంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేశారు యూపీఎ హయాంలో మన్మోహన్ సింగ్,సోనియా గాంధీ దేశ వ్యాప్తంగా 72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారు. ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించాం ఆగస్టు15న 22.50 లక్షల రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తి చేశాం.
మొదటి విడత రైతు భరోసా లో భాగంగా దాదాపు 7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి యేడాదిలోనే 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం
ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఇప్పటి వరకు ఆర్టీసీ కి 4000 కోట్లు ప్రభుత్వం చెల్లించింది గతంలో రైతు భరోసా సాయం 5000 రూపాయలు ఉంటే ఈ సారి ఎకరానికి యేడాదికి 12 వేల రూపాయలకు పెంచాం ప్రతి యేడాది 20 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ప్రతి యేడాది 12 వేల రూపాయలను చెల్లిస్తాం ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు 2004 నుంచి 2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తాం రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు గత పదేళ్లు గా కొత్త రేషన్ కార్డు లు ఇవ్వలేదు గ్రామ సభ లు పెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం గత పదేళ్లలో ఎప్పుడైనా గ్రామాల్లో అధికారులను చూశారా అని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధికారులు గ్రామ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.