by Suryaa Desk | Wed, Jan 29, 2025, 04:25 PM
ఏదైనా ప్రదేశాల గురించి వినడం కన్నా కళ్ల తో నేరుగా చూడటంతో పూర్తి విషయాలు తెలుసు కోవచ్చు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధిం చే పాఠాలను వినడం కన్నా వాటిని విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తేనే విద్యార్థులకు గుర్తుండి పోతుంది. విద్యార్థులకు ఏమైనా ప్రదేశాల గురించి తెలియాజేయాలంటే విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన విహారయాత్రలు ఎంతగానో ఉపయోగపడుతాయి. విహారయాత్రలు ఆహ్లాదం, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం విద్యార్థులను జిల్లాతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల చూడదగిన ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. దౌల్తాబాద్, ముబారస్ పూర్, ఇందుప్రియల్, శేరి పల్లిబందారం తో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులకు ఉల్లాసం ఉత్సాహం, విజ్ఞానం పెంపొందిచాలనే లక్ష్యంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. బాసర, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, భద్రాచలం, పాపి కొండలు, రామప్ప, భద్రకాళి, ఆలయాలను సందర్శించారు. హైదరాబాద్లో ఉన్న చూడదగిన ప్రదేశాలైన రామోజీ ఫిలిం సిటీ, మ్యూజియం, జూపార్క్, గొల్కోండ వంటి పురాతన కట్టడాలు, వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
పర్యాటక కేంద్రాలను చూడడంతో విద్యార్థులకు చిరకాలం గుర్తుండిపోతాయి
ఏదైనా ప్రదేశాలను, బంతువులను పర్యాటక ప్రాంతాలను నేరుగా చూడడం ద్వారా విద్యార్థులకు చిరకాలం గుర్తుండి పోతుంది. చాలా మంది ఉపాధ్యా యులు అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి పలు అంశాలను వివరిస్తున్నారు. ప్రతీ ఏటా విద్యార్థులు ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లే విధంగా విద్యాశాఖ ఆదేశాలు సైతం ఉన్నాయి. కొంత మంది విద్యార్థులను విహారయాత్రలో భాగంగా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. కట్టడాలను సందర్శించడం ద్వారా ఏ కాలంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి, రక్షణ విధాన్నాన్ని తెలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిం చడం ద్వారా భక్తిభావం, ఏకాగ్రత పెరిగి సన్మార్గంలో నడిచేందుకు వీలుంటుంది. విహారయాత్రలు విధ్యార్దులకు మేలు చేయడంతో పాటు ఆలోచన విధానాన్ని సైతం పెంచుతాయి.
ఆనందంగా ఉంది- విద్యార్థి
విహారయాత్రకు తోటి విద్యార్థులతో వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. బాసర సరస్వతి దేవి విశిష్టత తెలుసుకున్నాం. నేరుగా వీక్షించడం ఎప్పటికి గుర్తుండిపోతుంది. అవగాహన పెరుగుతుంది- ప్రధానోపాధ్యాయులు విహారయాత్ర వలన విద్యార్థులకు పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలపై అవగాహన పెరుగుతుం ది. ఎప్పుడు తరగతి గదిలో ఉండే విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తే ఉల్లాసంగా గడుపుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. పాఠశాల విద్యార్థులను పాపికొండలు, భద్రాచలం, రామప్ప ఆలయానికి తీసుకెళ్లి పర్యాటకకు ప్రదేశాల ప్రాముఖ్యతను తెలియజేశాం.