by Suryaa Desk | Wed, Jan 29, 2025, 09:04 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి నేడు (జనవరి 29) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా నివాసంలో సందడి నెలకొంది. మెగా కుటుంబ సభ్యులందరూ అంజనాదేవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఆమెపై పూల వర్షం కురిపించారు. అందరి నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ, ఉత్సాహంగా నడుచుకుంటూ వచ్చిన ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తల్లి కోసం చిరంజీవి హ్యాపీ బర్త్ డే సాంగ్ ను కూడా పాడారు.ఈ మేరకు చిరంజీవి తన తల్లి జన్మదిన వేడుకల గ్లింప్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "అమ్మా మాటల్లో వర్ణించలేనంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాం, నువ్వు ఊహించనంతగా నిన్ను గౌరవిస్తున్నాం అని ఈ ప్రత్యేకమైన రోజున నీకు చెప్పాలని కోరుకుంటున్నాం" అంటూ ఆ వీడియోకు చిరంజీవి క్యాప్షన్ పెట్టారు.