by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:49 PM
జిల్లా లో ఉండే అన్ని వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు కలిపించి మంచి వాతావరణములో విద్యార్థులు చదువుకునే ఆవకాశం కలిపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారము కల్లెక్ట్రేట్ కార్యాలయ సమావేశేము హాలు నందు ఎస్సి, బిసి, గిరిజన సంక్షేమ అధికారులు, వసతి గృహాల వార్డెన్ల తో ఏర్పాటు చేసిన సమావేశములో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఉండే అన్ని వసతి గృహాలకు ఇప్పటికే మొదటి విడత గా మంజూరు చేసిన నిదులతో వసతి గృహాలలో రిపిర్ పనులు పూర్తి చేశామన్నారు. ప్రతి వసతి గృహంలో చేసిన రిపేరుకు ముందు ఫోటోలు తర్వాత ఫోటోలు పి పి టి ద్వార పరిశీలించారు.
పనులకు సంబంధించిన ప్రతి హాస్టల్ లో రూప్ లీకేజీ, టై లెట్స్ , రన్నింగ్ వాటర్, కిటికీలు, తలుపులు , త్రాగునీటికి ఆర్ ఓ ప్లాంట్స్ అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాట్ల పై మండలం వారిగా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ ఏ హాస్టల్ లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని రూములు ఉన్నాయి , ఏ ఏ పనులు ఇంకా పెండింగ్ ఉన్నవి, చేసిన పనులే కాకుండా ఇంకా మిగిలిపోయిన పనులకు నిధులు మంజూరు చేయుటకు అధికారులు స్క్రూటినీ చేసి ప్రణాలికలు సిద్దం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్తానిక సమస్టలు ) సుదీర్, ట్రిని కలెక్టర్ ఉమాహరతి ,డి ఆర్ డి ఏ శ్రినివాస్, సాంఘీక సంక్షేమ అభివ్రుది అధికారి మల్లేశం, బి సి సంక్షేమ అధికారి ఉపేందర్, గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి, పంచాయతి రాజ్ డిప్యూటీ ఇంజనీర్లు మాధవ రెడ్డి, శ్రినివాస్, నాగ భూషణం ,ఎస్సి, బి, సి, గిరిజన వసతి గృహాల వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.