by Suryaa Desk | Tue, Jan 28, 2025, 02:30 PM
మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరస్వతి దేవి ఫోటో పట్ల అనుచితంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం భజరంగ్ దళ్ నాయకులు దామరగిద్ద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదువుల తల్లిగా సరస్వతి మాత కు పూజలు చేస్తామని అలాంటి మాత గురించి అనుచితంగా మాట్లాడారని చెప్పారు. వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.