by Suryaa Desk | Tue, Jan 28, 2025, 11:01 AM
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన ఇతర వాహనదారులు పోలీసులుకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గోల్కొండ కు చెందిన మాజ్, అహ్మద్, తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ గా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అనంతరం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఫ్లైఓవర్ ను ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది నగరంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ గా రికార్డుల్లోకి ఎక్కింది.కాగా ఇటీవల కాలంలో జీహెచ్ఎమ్సీ పరిధిలోని మహానగరంలో నిత్యం ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కొందరు తమ ప్రాణాలు కోల్పోతుంటే.. అతివేగం కారణంగా మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాహనదారులు అవగాహన కల్పించుకోకపోవడం, పోలీస్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల నిత్య పదులో సంఖ్యలో నగర ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూనే ఉన్న సంగతి తెలిసిందే.