by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:51 PM
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు స్పందించారు. తొక్కిసలాట ఘటనలో పదిహేను మంది మృత్యువాత పడ్డారని, మరికొంతమంది గాయపడ్డారని తెలిసిందని, ఇది విచారకర విషయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వివరించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన కారణంగా మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు.