by Suryaa Desk | Mon, Jan 27, 2025, 03:46 PM
దేశవ్యాప్తంగా చాలా కాలంగా పసిడి ప్రియులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నిరంతరాయంగా ఈ నెల ప్రారంభం నుంచి పెరిగిన ధరలు నేడు కొంత ఉపశమించాయి.గతవారం MCXలో పసిడి తొలిసారిగా 10 గ్రాములకు 83,000 మార్కును చేరుకున్న తర్వాత ప్రస్తుతం రేట్ల పతనం కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తాజా రేట్లను చూసి షాపింగ్ కి వెళ్లటం ఉత్తమం..ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7540, ముంబైలో రూ.7540, దిల్లీలో రూ.7555, కలకత్తాలో రూ.7540, బెంగళూరులో రూ.7540, వడోదరలో రూ.7545, జైపూరులో రూ.7555, కేరళలో రూ.7540, మంగళూరులో రూ.7540, నాశిక్ లో రూ.7557, అయోధ్యలో రూ.7555, బళ్లారిలో రూ.7540, గురుగ్రాములో రూ.7555, నోయిడాలో రూ.7555 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1700 తగ్గుదలను చూసింది. దీంతో నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8225, ముంబైలో రూ.8225, దిల్లీలో రూ.8240, కలకత్తాలో రూ.8225, బెంగళూరులో రూ.8225, వడోదరలో రూ.8230, జైపూరులో రూ.8240, కేరళలో రూ.8225, మంగళూరులో రూ.8225, నాశిక్ లో రూ.8244, అయోధ్యలో రూ.8240, బళ్లారిలో రూ.8225, గురుగ్రాములో రూ.8240, నోయిడాలో రూ.8240గా ఉన్నాయి. అయితే కొనుగోలుదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ పేర్కొన్న ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి వంటి ఖర్చులను కలపక ముందువిగా గుర్తించాలి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7540గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8225 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7540గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8225 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1,000 తగ్గి నేడు రూ.1,04,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.