by Suryaa Desk | Mon, Jan 27, 2025, 02:35 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఇండోర్ సమీపంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న 'సంవిధాన్ బచావ్' సభలో సీఎం పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సైతం వెళ్లారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంవిధాన్ బచావ్ ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తోంది.