by Suryaa Desk | Tue, Jan 28, 2025, 03:25 PM
తెలంగాణలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనకబడుతోందని.. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని CM రేవంత్ అన్నారు. 'దేవాలయాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం.
అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, వేములవాడ, కవ్వాల్, నల్లమల రిజర్వ్ ఫారెస్ట్, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలు ఉన్నాయి' అని తెలిపారు.