by Suryaa Desk | Wed, Jan 29, 2025, 12:44 PM
నాగర్ కర్నూల్ లో పట్టణ ప్రగతి నిధుల ద్వారా 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన యానిమల్ బర్త్ కేర్ సెంటర్ ను, ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ బుధవారం ప్రారంభించారు. వీధి కుక్కల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, వీధి కుక్కల పెరుగుదల నియంత్రణతో పాటు శునకాల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.