by Suryaa Desk | Thu, Jan 30, 2025, 03:27 PM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే సంకల్పాన్ని చాటుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్ అధికారులు పాల్గొన్నారు.