by Suryaa Desk | Wed, Jan 29, 2025, 01:46 PM
నారాయణపేట మండలం అప్పిరెడ్డి గ్రామ శివారులోని గుట్ట నుండి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని దానిని అడ్డుకోవాలని బుధవారం గ్రామస్తులు తహసీల్దార్ అమరేంద్ర కృష్ణకు వినతి పత్రం అందించారు. సర్వే నంబర్ 335, 339, 250 లో వున్న గుట్ట ప్రాంతం నుండి టిప్పర్, ట్రాక్టర్ లలో అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పారు. మట్టి రవాణాను అడ్డుకోవాలని కోరారు.