by Suryaa Desk | Mon, Jan 27, 2025, 03:01 PM
వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురు మహిళలను మధురానగర్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్ పీఎస్ పరిధిలోని జవహర్‌నగర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు జవహర్‌నగర్‌లోని ఓ గృహంపై దాడి చేశారు.ఈ దాడిలో వరలక్ష్మి అనే నిర్వాహకులు వివిధ జిల్లాల నుంచి మహిళలు, యువతులను ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుందని గుర్తించారు. కాగా దాడి సమయంలో వరలక్ష్మి తోపాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో పురుషులు ఎవరూ ఇంట్లో లేరు. వ్యభిచారం చేయించడానికి వరలక్ష్మి కి స్థానికంగా నివాసం ఉండే నరేష్ చౌడేశ్వరి అనే ఇద్దరు సహకరిస్తున్నారు. పోలీసులు నిర్వాహకురాలితో పాటుగా ఇద్దరు మహిళలను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.