by Suryaa Desk | Mon, Jan 27, 2025, 06:17 PM
ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం శానగుండ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలు అమలులో గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామంలోని లబ్ధిదారులందరికి మంజూరు పత్రాలు అందజేసినారు. ఓదెల మండలం ప్రత్యేక అధికారి జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ ముఖ్యఅతిథిగా విచ్చేసినారు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులు 69, భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 40, ఇందిరమ్మ ఇండ్లు 201, రైతు భరోసా 620 మందికి మంజూరు పత్రాలు అందజేసినారు.
మంజూరు కానీ లబ్ధిదారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు అలాగే పథకాలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి, తాసిల్దార్ యాకన్న, ఏవో భాస్కర్, ఎంపీ ఓ ఎండి షబ్బీర్ పాషా, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆల్ల సుమన్ రెడ్డి, ఎస్సై డి కొండ రమేష్, ఏ ఎస్ ఐ సుధాకర్. అంబాల కొమురయ్య ,సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు