by Suryaa Desk | Tue, Jan 28, 2025, 12:21 PM
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ 2009లో ‘అభయహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్వయం సహాయక సంఘాలకు CM రేవంత్ శుభవార్త చెప్పారు. ఈ పథకం కింద 2009 నుంచి 2016 వరకు స్వయం సహాయక బృందాలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు సెర్ప్ సహకారంతో గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.