by Suryaa Desk | Wed, Jan 29, 2025, 04:34 PM
మానేరు కుడికాలువ నీరు పంట పొలాలకు అందక పంట పొలాలు ఎండుతున్నాయని బిఆర్ఎస్ నాయకులు కాల్వను సందర్శించి కాలువపై నిరసన తెలిపారు ముస్తాబాద్ మండలంలోని సాగుచేసిన పంట పొలాలకు నీరు అందించాలని మల్లన్న సాగర్ తెనాలి ద్వారా మద్దికుంట చెరువు ముస్తాబాద్ పెద్ద చెరువు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండుటెండల్లో చెరువులను కుంటలు నింపిన ఘనత కేసిఆర్ కెసిఆర్ దేన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే యాడాది కాలంలో సాగు చేసుకున్న రైతులకు నీరు అందియ్యకుండా వారా బంద్ పేరుతో పంట పొలాలకు సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో పంట పొలాన్ని ఎండి పోతున్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించి.
ప్రతి ఎకరానికి నీరు అందించాలని కాలేశ్వరం ద్వారా ప్రాజెక్టు చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తూ రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు. పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి. మాజీ జెడ్పి కోఆప్షన్ సర్వర్ పాషా. బిఆర్ఎస్ నాయకులు శీలం స్వామి. మేంగని మనోహర్. గూడూరి భరత్. కోడె శ్రీనివాస్. దబ్బెడ రాజు .శంకర్. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.