by Suryaa Desk | Thu, Jan 30, 2025, 10:25 AM
TG: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే అదే సమయంలో తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌కు కూడా అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోరారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఈ నాయకుల తీరుపై మోదీ, అమిత్ షాకు లేఖ రాస్తానని చెప్పారు.