by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:42 PM
పుష్య మాసం ముగిసి.. మాఘ మాసం ఆరంభమైంది. ఇక ఈ నెల 31(శుక్రవారం) నుంచి వివాహ వేడుకలు ఆరంభం కానున్నాయి. పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుభ ముహూర్తంలో ఏడు అడుగులు, మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. అయితే మాఘ, ఫాల్గుణ మాసాల్లో మొత్తం 25 శుభ ముహూర్తాలు ఉన్నట్లు పంచాంగ కర్తలు, బ్రాహ్మణ పండితులు చెబుతున్నారు. అంటే జనవరి 31 నుంచి మార్చి 6వ తేదీ వరకు వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు కానున్నాయి.మాఘ మాసంలో జనవరి 31న ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం, రాత్రి, 7వ తేదీన ఉదయం, రాత్రి, 13వ తేదీన ఉదయం, 14న రాత్రి, 16, 20 తేదీల్లో మూడు వేళల్లో, 22, 23 తేదీల్లో రెండేసి శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో మార్చి 2న ఉదయం రెండు, రాత్రి రెండు ముహూర్తాలు, 6వ తేదీన మూడు వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నట్లుగా పండితులు తెలిపారు.
మాఘ మాసంలో జనవరి 31న ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం, రాత్రి, 7వ తేదీన ఉదయం, రాత్రి, 13వ తేదీన ఉదయం, 14న రాత్రి, 16, 20 తేదీల్లో మూడు వేళల్లో, 22, 23 తేదీల్లో రెండేసి శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో మార్చి 2న ఉదయం రెండు, రాత్రి రెండు ముహూర్తాలు, 6వ తేదీన మూడు వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నట్లుగా పండితులు తెలిపారు.