by Suryaa Desk | Thu, Jan 30, 2025, 07:38 PM
అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఏటిగూడ గ్రామానికి చెందిన ఎర్నాగి చిన్నన్న అనే వ్యక్తి 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ పొలంలోనే ఖననం చేశారు. ఇటీవలే దినం భోజనాలు కూడా పెట్టారు. అయితే బుధవారం ఉదయం పొలం వైపు వెళ్లిన కొందరు రైతులకు చిన్నన్న సమాధిని తవ్వి క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆందోళనకు చెందిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. చిన్నన్నను పూడ్చి పెట్టిన చోట నిమ్మకాయలు, గుమ్మడికాయ, మృతదేహం నుంచి బయటకు తీసిన ఎముకలు కనిపించాయి. వాటికి కుంకుమ, పసుపు రాసి ఉండటాన్ని నిందితులు కుంకుమ కనిపించడంతో పాటు మృతదేహం నుంచి ఎముకలు ఎత్తికెళ్లినట్లు గుర్తించారు.
ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలసులు.. ఏటిగూడ గ్రామానికే చెందిన వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన గెడం రావుజీ, కరీంనగర్ జిల్లాకు చెందిన చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఇద్దరిని మెుత్తంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్షుద్రపూజలు, గుప్త నిధుల సేకరణ కోసం పూడ్చిన శవాన్ని బయటకు తీసి ఎముకలు సేకరించినట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కొందరు హేతువాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలోనూ మరీ ఇలా ఉన్నారేంట్రా అని మండిపడుతున్నారు.