by Suryaa Desk | Thu, Jan 30, 2025, 08:23 PM
నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కందులకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 7, 550 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.