by Suryaa Desk | Fri, Jan 31, 2025, 02:05 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి బయట పిల్లల సర్వేలో భాగంగా సిఆర్పి కుర్మశెట్టి చందర్ వెన్నంపల్లి గ్రామంలో బడి బయట పిల్లల సర్వే చేయగా డ్రాప్ అవుట్ స్టూడెంట్ అయినా కోట సన్నీ ని గుర్తించడం జరిగింది కోట సన్నీ స్థానిక జెడ్ పి హెచ్ ఎస్ వెన్నంపల్లి పాఠశాలలో 9వ తరగతికి చదివి ఈ విద్యా సంవత్సరం జూన్ నెలలో బడి కి వెళ్లకుండా ఇంటిదగ్గర ఉండడం జరిగింది అట్టి విద్యార్థికి సి ఆర్ పి కౌన్సిలింగ్ చేసి చదువు యొక్క ఆవశ్యకత సమగ్ర శిక్ష అభియాన్ యొక్క నినాదమైన అందరూ చదవాలి.
అందరూ ఎదగాలి అనే దానిని స్ఫూర్తిగా తీసుకొని చదువు మనిషిలో ఆలోచన శక్తిని విచక్షణ జ్ఞానాన్ని అభివృద్ధి పెంపొందిస్తుందని కోట సన్నీకి కౌన్సిలింగ్ చేసి గౌరవ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో వెన్నంపల్లి ఉన్నత పాఠశాల లో 9వ తరగతిలో జాయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు తమ కుమారుడైన కోట సన్నీ తిరిగి చదువుకోవడానికి కౌన్సిలింగ్ చేసిన సి ఆర్ పి ని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అభినందించారు.