by Suryaa Desk | Fri, Jan 31, 2025, 02:26 PM
కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తన స్థాయిని మించి మాటలు మాట్లాడడం సరికాదని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.. అనంతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను నువ్వు, నువ్వు అని సంబోధించడం సరికాదని అన్నారు.బిఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే అనంతగిరి మండలంలో చేసిన అభివృద్ధి గురించి మీకు తెలియదా.? అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న శంకుస్థాపనలకే పరిమితమైన పథకాలనీ ఎద్దేవా చేశారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పై నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చామని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పాలన గ్రామసభల్లోని తేలిపోయిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో.. మండల ఉపాధ్యక్షుడు అఫ్జల్, ఏడుకొండలు, సీనియర్ నాయకులు పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ అధ్యక్షులు, బోస్ ,ప్రచార కార్యదర్శి సైదా, మట్టపల్లి వీరబాబు ఉన్నారు.