by Suryaa Desk | Fri, Jan 31, 2025, 04:20 PM
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. పార్లమెంట్లో కేంద్రం నేడు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టింది. అలాగే మరోవైపు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో శుక్రవారం ఉదయం నుంచి సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 77,500 దగ్గర ముగియగా.. నిఫ్టీ 258 పాయింట్లు లాభపడి 23,508 దగ్గర ముగిసింది.