by Suryaa Desk | Fri, Jan 31, 2025, 04:25 PM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో చందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేట గ్రామ కమిటీ నియమించారు. గ్రామ అధ్యక్షులుగా భాసోజి వేణు, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ నరేష్, గౌరవ అధ్యక్షులుగా తిప్పని నరసయ్య, ఉపాధ్యక్షులుగా జీడి వెంకటేశం, తిప్పన రాజయ్య, కోశాధికారిగా బొడ్డు భూమయ్యలు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.