by Suryaa Desk | Fri, Jan 31, 2025, 07:11 PM
మానేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డి.ఎస్.పి తెలిపారు ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అనుమతి లేకుండా ముస్తాబద్ మండలం కొండాపూర్ శివరులోని మానేరు వాగు నుండి దొంగతనంగా ఓ వ్యక్తి టిప్పర్ లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా పత్రిక విలేకారి అనే వ్యక్తి ఫోటోలో,వీడియోలు రికార్డ్ చేస్తుండగా అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తి అతని స్నేహితులు విలేఖరి ను ఫోటోలు వీడియోలు తీయవద్దని అడుగగా ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోగా, ఇసుక టిప్పర్ యజమాని.
అతని స్నేహితులు విలేకర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను తీసిన ఫొటోలు, వీడియో లు డిలీట్ చేయాలనీ లేకుంటే చంపుతాము అని బెదిరించగా, విలేఖరి వ్యక్తి ముస్తాబద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఇసుక టిప్పర్ యజమాని అతని స్నేహితులు మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అతని టిప్పర్ లారి, వేగనార్ కార్ ని సీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,అదేవిధంగా ఇసుక టిప్పర్ యజమాని తన ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను మానేరు వాగు నుండి తీసుక వస్తుండగా తాను పత్రిక విలేకరి అని ఫోటో లు, వీడియోలు తీస్తూ తనకు 10,000/- రూపాయలు ఇవ్వాలని లేకుంటే అట్టి ఫోటోలు, వీడియోలు జిల్లా ఎస్పీ,కలెక్టర్ల కు పంపుతాను అని బెదిరించాడం జరిగుందని గతంలో కూడా ఇలానే బెదిరించగా చాల సార్లు డబ్బులు ఇవ్వడం జరిగిందని ఇసుక టిప్పర్ యజమాని పిర్యాదు మేరకు విలేకరి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.