by Suryaa Desk | Thu, Jan 30, 2025, 08:31 PM
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సరూర్ నగర్ లో ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల వినతి పత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు(420) రోజులు గడుస్తున్నా 420 హామీలు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రాల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడుతూ అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని.. తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తులం బంగారం, నాలుగు వేల పెన్షన్, 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా రూ.15 వేలు వంటి అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు