by Suryaa Desk | Fri, Jan 31, 2025, 07:29 PM
మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి (5) సంవత్సరములు పూర్తి అయినందున పురపాలక సంఘమునకు స్పెషల్ ఆఫీసర్ గా అదనపు కలెక్టర్ సుధీర్ ని రాష్ట ప్రభుత్వం నియమించారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ వివిధ విభాగాల అధికారులను మున్సిపల్ సిబ్బంది అందరినీ మున్సిపల్ కౌన్సిల్ హాల్ యందు రివ్యూ సమావేశ పరచడమైనది. ఇట్టి కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ వివిధ విభాగాల అధికారులు సమావేశంలో పాల్గోన్నారు.
మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఎండీ .జాకీర్ అహ్మద్, కమిషనర్ కి మున్సిపల్ అధికారులకి పరిపాలన నిర్వహించడం లో దిశ, నిర్దేశాలు చేస్తూ తగిన సలహాలు సూచనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ హైమద్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.