![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:16 PM
హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అంతటితో ఆగకుండా హస్తినాపురం కార్పొరేటర్‌తో కూడా హనీమూన్ నడుస్తుందన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మహిళ నాయకురాలిపై ఇలాంటి కామెంట్లు దుర్మార్గమన్నారు. వెంటనే సారీ చెప్పాలని డిమాండ్‌చేశారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, వంగమధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసామ్యబద్ధంగా శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.