![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 02:46 PM
తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్ కి చెందిన మంచర్ల శ్రీలత తండ్రి మల్లయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు.
ఓవైపు తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె మనోధైర్యాన్ని పెంచుకొని టెన్త్ పరీక్షలో మొదటి ఎక్సామ్ తెలుగుకు హాజరైంది. ఆమె మనోధైర్యాన్ని చూసి అధికారులు, కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు.