|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 02:47 PM
మాదకద్రవ్యాలు తరలిస్తూ ముగ్గురు భారతీయులను ఇండోనేసియా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారు రాజు ముత్తు కుమారన్, సెల్వ దురై దినకరన్, గోవిందసామి విమలకందన్‌గా పోలీసులు వెల్లడించారు.
పక్కా సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించి వారి నుంచి 106 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు విచారణకు కెప్టెన్, ముగ్గురు నిందితులు హాజరుకాకపోవడంతో మరణ శిక్ష పడే అవకాశం ఉందంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.