![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 03:17 PM
BRS MLA ఫిరాయింపుల కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. కోర్టులు స్పీకర్‌ను ఆదేశించలేవని, కేవలం సూచన మాత్రమే చేయగలవని ముకుల్ రోహత్గి వాదించారు. 4ఏళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నోటీసు తర్వాతే MLAలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని స్పష్టం చేసింది. ఇరు వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది.స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయగా.. జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇక న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కామెంట్ చేశారు. ఇదివరకు కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని మర్చిపొవొద్దని అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టులు శక్తిలేనివి కావు. సుప్రీం కోర్టు నోటీసు తర్వాతే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారన్న బీఆర్ గవాయ్ ఫైర్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం ఫైర్ అయింది. పార్టీ పిరాయింపు కేసుల కోర్టు పరిధిలో ఉండగా.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి ఎలా అసెంబ్లీలో చెబుతారని ప్రశ్నించింది.